హిందూపురంలో టీడీపీకి షాక్..

 

అనంతపురం జిల్లాలో టీడీపీకి షాక్..పార్టీ సీనియర్ నేత ,  హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ పార్టీకీ రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు లేఖ పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీలో కొనసాగలేకపోతున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. రాజీనామా చేసిన అబ్దుల్ ఘనీ  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అబ్దుల్ ఘనీ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ.. టీడీపీలో 30 ఏళ్లుగా పనిచేసినా ప్రాధాన్యత లేదన్నారు. నాలుగున్నరేళ్లలో మైనారిటీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని అబ్దుల్ ఘనీ విమర్శించారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని ఘనీ అన్నారు.

హిందూపురం నియజవర్గం నుంచి అబ్దుల్ ఘనీ 2009 లో ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. కానీ 2014 ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ అక్కడ నుంచి పోటీ చేయటంతో ..బాలయ్య కోసం అయన సీటు త్యాగం చేశారు. అయితే..  సీటు త్యాగం చేసినందుకు గాను ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తానని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఆ హామీ ని నెరవేర్చడంలో విఫలం అయ్యారు. పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలకే ఆ నామినేటెడ్ పదవులను కట్టబెట్టారు. దీంతో అటు ఎమ్మెల్యే ..ఇటు నామినేటెడ్ పదవి దక్కపోవటంతో అబ్దుల్ ఘనీ అసంతృప్తిగా ఉన్నారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకి కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా ప్రకటించి  వైకాపాలో చేరారు.