జెన్‌కో ఉద్యోగుల కేటాయింపు నిలిపివేయండి.. హైకోర్టు
posted on Jun 12, 2015 5:02PM

తెలంగాణ జెన్‌కో, ట్రాన్ప్‌కోలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల బదిలీ పై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఉద్యోగుల బదిలీల కేటాయింపు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ విషయంలో కోర్టుకు మళ్లీ తమ వాదనలు వినిపిస్తామని.. విభజన చట్టానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నాం తప్పా.. వారి మీద మాకేం కోపం కాని.. వ్యతిరేకత కాని లేదని టీ సర్కార్ తెలిపింది. మరోవైపు అసలు ఉద్యోగుల విభజన అనేది ఒక కమిటీ వేసి, ఆప్షన్లు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్టు బదిలి అంటే కుదరదని ఏపీ స్థానికత ఉద్యోగులు తెలిపారు.