కల్లు కాంపౌండ్ల బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్?

 

కల్లు తాగిన కోతి అనే మాట విని వుంటారు. ఇప్పుడు కల్లు తాగిన హీరోయిన్ అనే మాటను కూడా వినండి. ఈ మాటను సృష్టించిన హీరోయిన్ ఎవరో తెలుసా? కన్నడ సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ సినిమా రంగాలకు షటిల్ సర్వీస్ చేస్తున్న సంజన గుర్తొస్తోందా? అదేనండీ ‘బుజ్జిగాడు’ సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించింది. ఆ తర్వాత ఎన్ని తంటాలు పడినా చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ వేషాలే తప్ప ‘బ్రేక్’ అంటూ లేకుండా అల్లాడుతోంది. పెద్ద అందగత్తె కాకపోయినా ఓ మోస్తరుగా వుండే సంజనకు పెద్దగా హీరోయిన్ అవకాశాలు లేకపోయినా ప్రతి సినిమా ఫంక్షన్‌లో మాత్రం ఠంచనుగా కనిపిస్తూ వుంటుంది. వేషాలు పెద్దగా లేకపోయినా ఈమె మీద ‘అలాంటి’ అరోపణలు, వివాదాలు చాలా వినిపిస్తూనే వుంటాయి. ఇప్పుడు మరోసారి ఈమె మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈరోజుల్లో హీరోయిన్లు పబ్బులకి వెళ్ళడం, అక్కడ తప్పతాగి హడావిడి చేయడం, నడి రోడ్డు మీద కారు దిగి హంగామా చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోవడం మామూలే. ఇప్పుడు ఈ సంజనమ్మ వెరైటీగా వుంటుందని కల్లు తాగింది. ఓల్డ్ స్టైల్లో తాటి ఆకులో కల్లు పోయించుకుంటూ ఈమె తాగుతున్న ఫొటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సంజన కల్లు తాగితే తాగింది.. కల్లు మంచితనం గురించి కూడా తన సన్నిహితులతో చెబుతోందట. కల్లు ప్రకృతిసిద్ధంగా లభించిన వరప్రసాదమని, కల్లు తాగితే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతోందట. ఈ విషయం కల్లు అమ్మకాలను ప్రోత్సహిస్తున్న అధికారంలో వున్న పెద్దమనిషికి తెలిస్తే, ఈమెని కల్లు కాంపౌండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించేస్తారేమో!