వడదెబ్బ బారిన పడకుండా ఎలా నివారించాలి?..

వడదెబ్బ ఎవరికీ వస్తుంది. వడదెబ్బ ప్రమాదం నుండి ఎలారక్షించు కోవాలి? మార్చ్ నెల చివరి వారం లోనే ఎండలు ముదిరి పోయాయి,వడగాడ్పులు ఎండవేడిమి పెరిగి పోతోంది.దీనికి తోడు మరెన్నో అనారోగ్య సమస్యలు పెరుగు తాయి. ముఖ్యంగా ముఖ్యంగా గుండె సమస్యల తో బాధ పడు తున్న వారువేసవి ఎండల నుండి సంరక్షించు కోవాలి.అన్నదే పెద్ద సందేహం.బహుశా మీరు వినే ఉంటారు చలికాలం వచ్చిందంటే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు చాలా ప్రమాదం పొంచి ఉందని ఈ వాతావరణం లో నూ గుండె సంబందిత సమస్యలు చూడ వచ్చని కేవలం మంచు గడ్డ కట్టే చలిలో మాత్రమే కాదు తీవ్రమైన ఎండా వేడిమి కూడా గుండె సంబంధిత సమస్యలను పెంచుతుంది.వాస్తవానికి ఒక పరిశోదన ప్రకారం వాతావరణం లో వచ్చే కొన్ని మార్పులు గుండె సంబంధిత సమస్యలు మనల్ని ఇబ్బందుల లోకి నెడతాయి అని నిపుణులు అంటున్నారు.

వడ దెబ్బ ఎలా వస్తుంది...?

ఈ సంవత్సరం ఎండాకాలం అదే వేసవి కాలం త్వరగా వచ్చేసినట్లు ఉంది కదా అంతే కాదు. వేడిమి ఉష్ణోగ్రతలు క్రమేపి త్వరగా పెరుగుదల కనిపిస్తుంది. గుండె సంబంధిత రోగులకు వడదెబ్బ ప్రమాదం పొంచి ఉంది ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం వేడిగా ఉన్న వాతావరణం లో మనశరీరం లో వేడి పెరిగి పోతుంది. మనము ఎండవేడిమి ఉన్న ప్రాంతం లో నివసించక తప్పదు. మీ గుండెలో  స్పందనలు వేరు వేరుగా ఉంటాయి గుండెలో దడ హార్ట్ బీట్ లో మార్పులు వస్తాయి.రక్త ప్రసారం అందించాలంటే చాలా ఇబ్బంది పడాలి.అందుకే శరీరం తనకు తానుగా చల్లగా చేసుకోదో ఆ ఒత్తిడి గుండె ఇతర అవయవాల పైన పడుతుంది. దీనివల్ల వారికి తీవ్రనష్టం ఏర్పడుతుంది. ఈ కారణం గానే గుండె పై దాడి చేస్తుంది వడదెబ్బ రూపం లో భయట పడుతుంది.

వడ దెబ్బ వల్ల ప్రమాదమే ఎక్కువట...

వడదెబ్బ ఎవరికైనా  తగలవచ్చు. వాటిని ఎదుర్కోవచ్చు. ఎవరైతే గుండె సంబందిత సమస్యలతో బాధపడుతున్నారో. వడ దెబ్బ ప్రమాదం పొంచి ఉంది.గుండె జబ్బులు ఉన్న వారిలో చమట వస్తే ప్రమాదమే అని గుర్తించాలి.ఎప్పుడైతే ఎండవేడిమి పెరిగి పోతుందో. మనందరికీ చమట వస్తుంది. శరీరం లో చేరే వేడికి వ్యతిరేకంగా సహజం గానే అది పని చేస్తుంది. అయితే గుండె సంబంధిత రోగులకు ఈ విషయం అంత సులభం కాదు. అది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.శరీరానికి అవసరమైన ఖనిజాలు చమటరూపం లో  బయటికి పోతాయి.ఈ కారణం గానే గుండెపై తీవ్రాత్తిది పెరుగుతుందని వైద్యులు గుర్తించారు.వేసవి కాలం లో మీ శరీరం  ఆరోగ్యంగా ఉంచాలంటేడీ టాక్సీ ఫికేషణ్ కోసం ఈ ఆహారాన్ని తీసుకోండి.

వదదెబ్భ నుండి ఎలారక్షించు కోవాలి?...

నీరు ఎక్కువగా తీసుకోవాలి.గుండె సంబంధిత రోగులు క్రమం తప్పకుండా డాక్టర్ సూచించిన మందులు వాడు కుంటూ ఎక్కువగా మంచినీరు తాగే ప్రయత్నం చెయ్యాలి.ఎండవేళ లో బయటకు రాకండి..అధికంగా వేడిమి ఉండే సమయం లో అదీ మధ్యాహ్నం 12 గం నుండి సాయంత్రం 4 గం వరకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆసమయంలో బయటికి రావద్దని ఒక వేళ తప్పని సరి పరిస్థితిలో బయటకు వస్తే మంచి నీటి బాటిల్ మీ వెంట తీసుకు వెళ్ళండి. ఎండనుండి రక్షించుకునేందుకు టోపీలు లేదా షేడ్స్ వాడండి.

వ్యాయా మం తప్పక చేయండి...

గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలాని సూచించారు. ఉదయం వేళలో మాత్రమే వ్యాయామం చేయాలి.లేదా వాతావరణం కాస్త చల్ల బడ్డాక వ్యాయామం చేయాలి. ఒకవేళ ఎక్కువగా చమట వస్తుంటే మీగుందే వేగం పెరిగి పోతుంది.గుండె నొప్పి సమస్యలుమళ్ళీ ప్రారంభ మౌతాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను  సంప్రదించడం అవసరం.

రెగ్యులర్ చకప్ చేయించండి...

వాతావరణం ఎలా ఉన్నా గుండె వ్యాధులు తో బాధ పడు తున్నవాళ్ళు రెగ్యులర్ చకప్ చేయిస్తూ ఉండాలి. దీనిద్వారా మిమ్మల్ని మీరు మీ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలని తద్వారా వేసవి కాలం లో వచ్చే వడ దెబ్బ నుంచి మీ గుండెను కా పా డుకోవాలని సూచిస్తున్నారు. వేసవి కాలం లో వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.