తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
posted on Feb 8, 2023 2:03PM
నందమూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితిపై గత నాలుగు రోజులుగా ఎలాంటి అప్ డేట్స్ బయటకు రావడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందనీ, మరింత మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయనను విదేశాలకు తరలించే అవకాశం ఉందని కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. అంతే ఆ తరువాత ఆయన ఆరోగ్యం గురించిన ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు.
గత నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేష్ ప్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నగుండెపోటుకు గురైన సంగతి విదితమే. తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నాలుగు రోజుల నుంచి ఆయన హెల్ట్ అప్ డేట్ బయటకు రాలేదు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపడింది, పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. మెదడు రికవరీ చికిత్స చేస్తున్నట్లు కొన్ని రోజుల కిందట వెల్లడించారు. అప్పడే ఆయన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయనీ తెలిపారు.