రాహుల్ పై శివసేన ప్రశంసలు...
posted on Dec 18, 2017 2:42PM

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పై చాలా తక్కువ సీట్లతో విజయం సాధించింది. బీజేపీ గెలవడం ఏమో కానీ... కాంగ్రెస్ పార్టీ మాత్రం బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిందనే అనుకుంటున్నారు అందరూ. నిజానికి అది వాస్తవం కూడా. ఇక మిత్రపక్షమని కూడా చూడకుండా బీజేపీపై అప్పుడప్పుడు విమర్శలు గుప్పించే శివసేస మళ్లీ ఒకసారి బీజేపీకి షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై శివసేన ప్రశంసలు కురిపించింది.‘ఇలాంటి కీలకమైన దశలో కాంగ్రెస్ అధ్యక్షుడి బాధ్యతలను రాహుల్‌గాంధీ స్వీకరించారు. అందుకు ఆయనకు అభినందనలు చెప్పాలి. ఓటమి భయంతో కొందరు పెద్దపెద్దవారే వెనకడుగు వేస్తుండగా.. తుది ఫలితాలను పట్టించుకోకుండా రాహుల్ ఎన్నికల యుద్ధానికి దిగారు. ఈ నమ్మకమే రాహుల్‌ను ముందుకు నడిపిస్తుంది’ అని ఠాక్రే అన్నారు.