వర్షాల కోసం 33 జిల్లాల్లో 41 యజ్ఞాలు- గుజరాత్‌

 

ఈసారి గుజరాత్‌కు అంతగా అచ్ఛేదిన్‌ వచ్చేట్లు కనిపించడం లేదు. ఈ ఎండాకాలం సూర్యడు భగభగా మండటంతో భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతున్నాయి. జనం నీళ్ల కోసం కటకటలాడిపోతున్నారు. జరుగుతున్నదాన్ని చూసిని గుజరాత్ బీజేపీ సర్కారుకి ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తీవ్రమైన కరువు తప్పదని అంచనా వేస్తోంది. అది రాబోయే ఎన్నికల మీద కూడా ప్రభావం చూపవచ్చు. అందుకనే ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని ఓ చిత్రమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంద్రుడు, వరుణుడ శాంతించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలలో 41 భారీ యజ్ఞాలను తలపెట్టారు. మరి ఆ యజ్ఞాలు ఏమేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే!