ఇండియన్ గ్రేటెస్ట్ యాక్టర్..అన్న ఎన్టీఆర్
posted on Mar 8, 2013 1:14PM

ఇండియన్ సినిమా వంద సంత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్బంగా 'సిఎన్ఎన్ ఐబిఎన్' దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియాన్ యాక్టర్''తెలుగుజాతి గర్వించదగ్గ నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వబౌమ నటరత్న పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు'' గారు ఎంపికయ్యారు. నందమూరి తారకరామారావు గారు 53% ఓట్లు దక్కించుకుని ‘ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్'గా మొదటి స్థానంలో నిలవగా, తమిళ నటుడు కమల్ హాసన్ 44% ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
'ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్' హీరోయిన్ లలో శ్రీదేవి మొదటి స్థానంలో నిలిచింది. 39% ఓట్లతో శ్రీదేవి టాప్ లో నిలవగా, బాలీవుడ్ బ్యూటీ మాధురి దీక్షిత్ 16% ఓట్లతో రెండో స్థానంలో, తెలుగు నటి సావిత్రి 12% ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నారు.
'ఆల్ టైం గ్రేటెస్ట్ ఇండియన్' మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా గారు 49% ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. 29%ఓట్లతో ఎ.ఆర్. రెహమాన్ రెండవ స్థానంలో నిలిచారు.