రైతు బంధు పథకానికి ప్రపంచమంతా ప్రశంసలు
posted on Jan 26, 2019 11:24AM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందని అన్నారు. నాలుగున్నరేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు. రైతు బంధు పథకాన్ని ప్రపంచమంతా ప్రశంసిస్తోందని చెప్పుకొచ్చారు. రూ. 40 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. పెన్షన్ల అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించామని, సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని, భవిష్యత్‌లో మరో రూ.లక్షా 17 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. మిషన్ భగీరథ మార్చి నాటికి పూర్తికానుందని తెలిపారు. 24 గంటల విద్యుత్ కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. రైతుబంధు, రైతు భీమాతో దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచామని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు.