‘గోపాల గోపాల’ విడుదల వాయిదా

 

వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమా ఈనెల 9వ తేదీన విడుదల కావలసి వుంది. అయితే ఈ సినిమా ఆ తేదీన విడుదల కావడం లేదని తెలిసింది. ఈ సినిమా సెన్సార్ బుధవారం నాడు జరగాల్సి వుంది. అయితే ఆరోజు అనివార్య కారణాల వల్ల సెన్సార్ విడుదల వాయిదా పడింది. సెన్సార్ గురువారం నాడు జరనున్నట్టు తెలుస్తోంది. అందువల్ల ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఈనెల 11, 14 తేదీల మధ్యలో ‘గోపాల గోపాల’ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. హిందీలో విజయం సాధించిన ‘ఓ మై గాడ్’ సినిమా ఆధారంగా ‘గోపాల గోపాల’ రూపొందింది. హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ పాత్రను వెంకటేష్ ధరించారు. ఈమధ్యే ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్‌ సినిమాపై అంచనాలు వున్నాయి. కిషోర్‌ పార్థసాని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డి.సురేష్‌ బాబు, శరత్‌ మరార్‌ నిర్మాతలు.