సిల్వర్ జూబ్లి వేడుకలు జరుపుకుంటున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్
posted on Sep 27, 2023 12:58PM
ప్రపంచ వ్యాప్తంగా అందరి అభిమానాన్ని చూరగొన్న గూగుల్ ఇంజిన్ 25వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ 04, 2023న ఈ శోధన ఇంజిన్ పుట్టింది.25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లి వేడుకలు జరుపుకుంటోంది. 1998లో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ అనే ఇద్దరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ విద్యార్థులచే గూగుల్ ఇంజిన్ స్థాపించబడింది.
ఏదైని సమాచారాన్ని చిటికెలో తెల్సుకునే మార్గం గూగుల్ తప్ప మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇది కేవలం ఒకే క్లిక్‌తో కనెక్ట్ అవ్వడానికి మార్గం సులభతరం చేసింది.
గూగుల్ ప్రధాన లక్ష్యం "ప్రపంచ సమాచారాన్ని సేకరించి తన వినియోగదారులకు అందించడమే’’.
దశాబ్దాలుగా ఈ టెక్ సెర్చ్ దిగ్గజం అనేక ఇతర ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ ఉత్పత్తులన్నీ వినియోగదారులకు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. కనెక్షన్ పరంగా వినియోగదారులకు అత్యంత సులభతరంగా ఉంది.
భాష అనే అవరోధం లేకుండా వివిధ దేశాలకు వెళ్లడానికి గూగుల్ సెర్చ్ ఇంజిన్ సులభతరం చేసింది. ఇప్పుడు తమ కంప్యూటర్‌ల ముందు కూర్చుని గూగుల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా భూగోళాన్ని అన్వేషించడం గూగుల్ సెర్చ్ ఇంజిన్ తప్ప మరొకటి కాదు అని నిరూపితం అయ్యింది. హ్యాపీ బర్త్ డే గూగుల్.