ఒరాకిల్ పై గెలిచిన గూగుల్..

 

ఎట్టకేలకు గూగుల్, ఒరాకిల్ మధ్య జరుగుతున్న పోరులో గూగుల్ గెలిచింది. గూగుల్ కు సంబంధించిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించేందుకు కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమకు సంబంధించిన జావాకోడ్ ను గూగుల్ వినియోగించుకుందని ఒరాకిల్ 2010లో కేసు పెట్టింది. దీనికి పరిహారంగా 9 బిలియన్ డాలర్లు తమకు చెల్లించాలని కూడా ఒరాకిల్ డిమాండ్ చేసింది. అప్పటి నుండి అమెరికా కోర్టులో రెండిటి మధ్య పోరు జరుగుతూనే ఉంది. ఆఖరికి దీనిపై విచారించిన కోర్టు గూగుల్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.