దెయ్యం ఇల్లు తగలబెట్టింది

 

దెయ్యం.. అసలు ఉందో లోదో తెలియదు కానీ ఆమాట వింటేనే భయపడతాం. దెయ్యాలు ప్రతీకారం తీర్చుకుంటాయి అని వింటుంటాం... సినిమాలలో కూడా చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఇక్కడ నిజంగానే ప్రతీకారం తీర్చుకుంది అంటున్నారు. ఎక్కడ అనుకుంటున్నారా... ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్ లో గాజులు తయారుచేసే కుటుంబానికి చెందిన ఓ ఇల్లు హఠాత్తుగా తగలబడిపోయి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదైపోయాయి. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు పదిహేనేళ్ల క్రితం అనుమానాస్పదంగా చనిపోయిన ఆ ఇంటి కోడలు పింకియే నాశనం చేసిందని అంటున్నారు. అప్పుడప్పుడు పింకీ కలలోకి వస్తుంటుందని, చంపేస్తానని బెదిరిస్తుంటుందని పింకీ అత్తగారు అంటున్నారు. పింకీ చనిపోయిన తరువాత ఆమె భర్త నాగేంద్ర రెండో పెళ్లి చేసుకోగా ఆమెకి కూడా దెయ్యం పట్టి పీడిస్తుందని, తన పిల్లాడిని కూడా చంపేసిందని నాగేంద్ర తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu