వైసిపి పాలనపై ప్రధానికి ఫిర్యాదు చేయనున్న గల్లా జయదేవ్...

అమరావతిలో నెల రోజులుగా రైతు కుటుంబాలు ఆందోళన చేస్తున్నా ఇంత వరకూ సీఎం గాని ఎమ్మెల్యేలు గాని పట్టించుకోలేదన్నారు ఎంపీ గల్లా జయదేవ్. దీంతో తమ గోడు చెప్పుకోవడానికి అసెంబ్లీకి వెళుతుంటే రైతులతో పాటు టిడిపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారన్నారు. పోలీసులు తమ వాళ్లతోనే మట్టి పెల్లలు వేయించుకుని లాఠీ చార్జి చేశారని ఆరోపించారు. దీనిపై పార్లమెంటుతో పాటు ప్రధాని, కేంద్ర హోం మంత్రికి, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు గల్లా జయదేవ్.

నరేగా నిధులు పెండింగ్ పై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్రం మరియు హై కోర్టు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం నరేగా నిధులు విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. కాంట్రాక్టర్ లకు బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ఆ బిల్డింగ్ లకు మాత్రం రంగులు వేసుకుంటుందని విమర్శించారు. ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో ఆ పథకం ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా వినియోగించుకోలేని విధంగా మన రాష్ట్రంలో వినియోగించుకొని అనేక పథకాలతో చంద్రన్న బాటని సీసీ రోడ్లు, కమ్యూనిటీ బిల్డింగ్స్, అంగన్ వాడీ బిల్డింగ్స్, పంచాయతీ బిల్డింగ్ లు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఇలా అనేక కార్యక్రమాలు నరేగా నిధులతో గతంలో టిడిపి చేయించడం జరిగిందని అన్నారు. అటువంటి కార్యక్రమాలకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరముందో కేవలం తెలుగు దేశం పార్టీ హయాంలో ఆ కార్యక్రమాలు జరిగాయనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ బిల్లులు కూడా చెల్లించకుండా చాలాకాలం జాప్యం చేశారు అని ఆరోపించారు.