జగన్ దీక్ష అక్కడ చేయాలి
posted on Aug 8, 2015 6:38PM

కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్ కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం పై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్న చేపట్టనున్నారు. ఇప్పుడు ఈ విషయంపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు జగన్ పై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని.. ఒక వేళ దీక్ష చేయాలనుకుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి ముందు చేసుకోవాలని విమర్శించారు. ఎప్పుడూ విమర్శించే పని తప్ప కనీసం రాష్ట్రం విభజించేటప్పుడు సీఎం చంద్రబాబు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నారా.. పైగా ఇప్పుడు విమర్శలు గుప్పించడం అనైతికం అని మండిపడ్డారు. అసలు ప్రత్యేక హోదాను బిల్లులోనే పెట్టకపోవడం దారుణమని గాలి మండిపడ్డారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి టీడీపీ ప్రయత్నిస్తూనే ఉందని చెప్పారు.