అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్
posted on Jun 26, 2025 12:56PM
.webp)
ఏపీలో రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు. పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. దీంతో చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇక పర్యాటకులకు నూతన శోభను సంతరించుకోనుంది. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు 2027లో జరిగే పుష్కరాల నాటికి ఇది పూర్తి కానుంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదని, శక్తివంతమైన నాయకత్వమని పవన్ అన్నారు.
రాజమండ్రి అంటే గుర్తుకు వచ్చేది గోవావరి తీరం అన్నారు. ఆది కవి నన్నయతో పాటు ఎంతో మంది కళాకారులు జన్మనిచ్చిన నేల ఇదని అన్నారు. తీరం వెంబటి నాగరికత, భాష అన్నీ పెరుగుతాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు.ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇదన్నారు. టూరిజం రంగంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉందన్నారు. హేవ్ లాక్ బ్రిడ్జి చాలా పురాతనమైనది, వాడకుండా వదిలేయబడింది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచించి పర్యాటకం కింద మంచి ప్రాజెక్ట్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. శక్తివంతమైన నాయకులు, ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని అభాప్రాయపడ్డారు. పుష్కరాలన నాటికి అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు