తిరుమలలో తాగుబోతు ఖాకీల హల్ చల్

తిరుమలలో ముగ్గరు తాగుబోతు ఖాకీలు హల్ చల్ చేశారు.  మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్‌రోడ్డులో ర్యాష్‌ డ్రైవింగ్‌తో పలు వాహనాలను ఢీకొట్టారు.  ఇక కొండపై భక్తులను  ఇబ్బందులకు గురిచేశారు.  మద్యం తాగిన పోలీసులను  టీటీడీ విజిలెన్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు పోలీసులూ కర్నూలుకు చెందిన   రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గాగుర్తించారు.

 వీరిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తే 300 పాయింట్లు చూపినట్లుగా తెలుస్తోంది.  తిరుమలలో వరుస అపచారాలపై భక్తుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తప్పతాగిన కానిస్టేబుళ్లు అలిపిరి వద్ద తనిఖీలను దాటుకుని ఎలా వచ్చారన్న ప్రశ్న భక్తుల నుంచి వస్తున్నది. ఇటీవల కొన్ని రోజుల కిందట   తిరుమల పాపవినాశనం రోడ్డులోని కల్యాణ వేదికలో ఓ వ్యక్తి నమాజ్‌ చేసిన ఘటన మరువక ముందే.. ముగ్గురు పోలీసులు ఏకంగా తప్పతాగి తిరుమల కొండపైకి వచ్చి నానా హంగామా చేసిన సంఘటన జరగడంతో అసలు తిరుమలలో నిఘా ఉందా అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  నమాజ్‌ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లు టీటీడీ సిబ్బంది గుర్తించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu