ఆమోదం లేకుండానే ఆహార భద్రత షురూ

 

సోనియాగాంధీ మానస పుత్రికగా భావిస్తున్న ప్రతిష్టాత్మక ఆహార భద్రత పథకానికి సోనియాగాంధీ మంగళవారం పచ్చజెండా ఊపారు. రాజీవ్‌గాంధీ జయంతి రోజునే ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించారు సోనియా. మరే ప్రపంచ దేశాల్లో లేని విధంగా భారత్‌లోనే తొలిసారి ఇలాంటి పథకాన్ని అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఈ లోపు బిల్లును ఆమోదింప చేయాలని భావించినా అది కుదరక పోవటంతో అమోదానికి ముందే లాంచనంగా ప్రారంభించేశారు.

బొగ్గు కుంభకొణంపై ప్రదాని వివరణ ఇవ్వాలని బిజెపి పట్టుపట్టడంతోపాటు, టీడిపి ఎంపిలు రాష్ట్రవిభజనపై ఆందోళనకు దిగటంతో ఆహార భద్రత బిల్లు పార్లమెంట్‌లో చర్చకు రాలేదు. అందుకే పార్లమెంట్‌ ఆమోదంతో సంబందం లేకుండానే పథకానికి సోనియా శ్రీకారం చుట్టారు. నిరుపేద మహిళలకు ఆహార ధాన్యాల ప్యాకెట్లు, ఆధార్ ఆధారిత స్మార్ట్‌కార్డ్‌లను అందజేశారు.

ఈ పథకం ద్వారా దేశంలోని 125 కోట్ల ప్రజలలో 80 కోట్ల మందికి తక్కువ ధరలకే ఆహార ధాన్యాలు అందుతాయని, నగరాల్లోని ప్రజలల్లో కూడా ఎక్కువ శాతం మంది లభ్ది పొందుతారన్నారు. ఇలాంటి పథకం అమలు చేస్తున్నందుకు కాంగ్రెస్‌ పార్టీ గర్విస్తుందన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu