భోజనంలో బల్లి... బాబోయ్...
posted on Aug 17, 2015 5:39PM

మధ్యాహ్న భోజనంలో బల్లి పడటంతో అది తిన్న 30 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇటావా జిల్లాలోని జవహర్ నవోదయ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో బల్లి పడింది. దాన్ని గమనించని విద్యా్ర్థినులు ఆ ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం బాలికలు వాంతులు అవుతున్నట్టు పాఠశాల సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే వైద్యుడిని పాఠశాలకు పిలిపించి ప్రథమ చికిత్స చేయించారు. పిల్లలను ఆస్పత్రిలో చేర్పించకుండా పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకి గురైనప్పటికీ, సరైన సమయంలో వైద్య సహాయం అందడంతో అందరూ కోలుకున్నారని పాఠశాల సిబ్బంది ప్రకటించారు.