గెట్ అవుట్ అన్నందుకు..బాస్‌ను మట్టిలో పాతేశాడు..
posted on Jun 5, 2016 3:02PM

తనను గెట్ అవుట్ అన్నందుకు ఓ బాస్‌పై ఓ ఉద్యోగి దారుణంగా పగతీర్చుకున్నాడు. ఫ్లోరిడాలో ఓ నిర్మాణం వద్ద ఎరిక్ కాక్స్ అనే వ్యక్తి రోలర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ సైట్‌లో మట్టి తీస్తూ ఉంటాడు. ఆ సమయంలో తన సూపర్‌వైజర్ వచ్చి ప్రశ్నించడంతో పాటు చేయి కూడా చేసుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతే తన రోలర్‌తో గుద్దించడమే కాకుండా ఐరన్ రాడ్‌తో అతని తలపై కొట్టి స్పృహలేకుండా పడిపోయాడు. అయినా కోపం తగ్గని ఎరిక్ అతడిని నడుము వరకు మట్టిలో పాతేశాడు. దూరం నుంచి మనోడి పిచ్చి చేష్టలు చూస్తున్న ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఎరిక్స్‌ను అరెస్ట్ చేసి బాస్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే తనను కారణంగా లేకుండా దూషించాడమే కాకుండా గెట్ అవుట్ అన్నాడని, అనంతరం చేయి చేసుకుని తల నరికేస్తానని బెదిరించాడని పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో తాను రోలర్ నడుపుతుండటంతో ప్రమాదవశాత్తూ దాని కింద పడ్డాడని అన్నాడు