షూటింగ్ లో అగ్నిప్రమాదం

Fire accident , accident in shooting, yalamanchili raju, one spot dead, intintaa annamayya, short circuit, bhanu prakash, cameraman died, men injured, shooting stoped

 

అరకులో తీస్తున్న ఓ సినిమా సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. కోడిపుంజు వలస దగ్గర్లో వేసిన సినిమా సెట్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అసిస్టెంట్ కెమెరామన్ భాను ప్రకాష్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంటింటా అన్నమయ్య సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగింది.

 

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. గాయపడ్డ వ్యక్తుల్ని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామరాజ్యం సినిమా నిర్మాత యలమంచిలి రాజు ఇంటింటా అన్నమయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమాదం కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu