ఫిజీలో 6.8తో తీవ్రతతో భూకంపం..

భారీ భూకంపంతో ఫిజీ ఇవాళ ఉదయం వణికిపోయింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదయిందని యూఎస్ జిలాజికల్ సర్వే తెలిపింది. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు అందాల్సి ఉంది. ఫిజీలోని ఎండోయ్ ద్వీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు.