ఏపీ అసెంబ్లీలో డిష్యూం డిష్యూం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. బాహాబాహీకి దిగారు. జీవో నంబర్ 1 రద్దు చేయాలన్న డిమాండ్ తో తెలుగుదేశం సభ్యులు  స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో ఆయన  తన స్థానం నుంచి లేని లోనికి వెళ్లిపోయారు.

ఆ సందర్భంగా తెలుగుదేశం, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. తెలుగుదేశం ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ లు ఒకరితో ఒకరు తలపడ్డారు.

దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో తిరిగి వచ్చిన స్పీకర్ సభను వాయిదా వేశారు. అయినా  తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీ వెల్‌లో కూర్చొని నిరసన చేపట్టారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu