శరీరానికి కొవ్వు కూడా అవసరమే.. ఎందుకంటే..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, పోషకమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు,  తదితరాలు పోషకాహారంలోనే  సమృద్ధిగా ఉంటాయి. శరీరం సరిగ్గా పని చేయడానికి అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి. కొవ్వు కూడా వాటిలో ఒకటి. అయితే, కొవ్వును తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం పెరుగుతుందని అనుకుంటారు. కానీ మన శరీరానికి కొవ్వు చాలా అవసరం. ఈ కొవ్వు రెండు రకాలుగా ఉంటుంది.   ఆరోగ్యకరమైన కొవ్వు ,  అనారోగ్యకరమైన కొవ్వు. మనకు ఆరోగ్యకరమైన కొవ్వు అవసరం.   చాలా మందికి ఆరోగ్యకరమైన కొవ్వులు ఏవో, అవి ఎందులో లభిస్తాయో వాటి ఉపయోగాలు ఏంటో సరిగ్గా తెలియదు.  దీని గురించి తెలుసుకుంటే..

ఆరోగ్యకరమైన కొవ్వు అంటే..

కొవ్వులు కూడా ఒక రకమైన పోషకాలు. ప్రొటీన్-ఐరన్ లాగా మన శరీరం శక్తిని పొందడానికి, విటమిన్‌లను శోషించడానికి,మెరుగైన గుండె,మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం. మోనోఅన్‌శాచురేటెడ్ , పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులను  ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణిస్తారు. ఇవి  అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే ఆరోగ్యకరమైన కొవ్వులు తప్పనిసరిగా తీసుకోవాలి. 

ఆరోగ్యకరమైన కొవ్వులు ఎందుకు ముఖ్యమైనవంటే..

కండరాలను నిర్మించడానికి ప్రోటీన్, రక్త పరిమాణాన్ని నిర్వహించడానికి శరీరానికి ఐరన్ ఎలా  అవసరమో, అదే విధంగా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా  చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన కొవ్వులను ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలపై చేసిన అధ్యయనాలు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలవని, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయని, రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుందని , శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుందని స్పష్టం చేశాయి.

ఆరోగ్యకరమైన కొవ్వును డైటరీ ఫ్యాట్ అని కూడా అంటారు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.కానీ  దానిని అధికంగా తీసుకుంటే, అది  ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది. కాబట్టి మీ ఆహారంలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉండేలా చూసుకోవాలి.

శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వును ఆహారంలో అనేక రకాలుగా పొందవచ్చు. 

 సాల్మన్, మాకేరెల్ మొదలైన వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి  ఆరోగ్యకరమైన కొవ్వులు.  అలాగే ఆలివ్ నూనె, బీన్స్, అవకాడో, బాదం, నెయ్యి వంటి వాటిలో ఆగోర్యకరమైన కొవ్వులు ఉంటాయి.

   ◆నిశ్శబ్ద.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News