కేంద్రం దిగి వచ్చినా ఆగని రైతు ఆందోళన.. కొత్త డిమాండ్లతో రెండో సంవత్సరంలోకి..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజదాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళన సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ రోజును దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ముందుగానే మూడు వివదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంది.స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురు నానక్ జయంతి రోజున వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే చటాలు మంచివే, సదుద్దేశంతో చేసినవే, అయితే ఈ చట్టాలను వ్యతిరేక్సితున్న కొందరిని ఒప్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకే చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సందర్భంగా ప్రధాని కొందరిని ఒప్పించలేని ప్రభుత్వ అశక్తతను అంగీకరించారు.రైతులను క్షమాపణలు కోరారు. 

అయినా, ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నాయకులు, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించలేదు. సంతోషం వ్యక్తం చేయలేదు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో చట్టాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రాధాని హామీ ఇచ్చినప్పటికీ... కొత్త డిమాండ్లను తెరమీదకు తెచ్చి ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. మూడు చట్టాలను రద్దు చేస్తే చాలు, ఆందోళన విరమింఛి వెనక్కి వెళ్లి పోతామని చెప్పిన రితు నాయకులే, ఇప్పుడు, ఎంఎస్’పీ (కనీస మద్దతు ధర), ఆందోళన సందర్భంగా చనిపోయిన వారికి  నష్ట పరిహారం. కేసుల ఎత్తివేత వంటి కొత్త డిమాండ్ల సాధన కోసం పాత ఉద్యమాన్ని కొత్త పంథాలో నడిపించాలని, నిర్ణయించారు. ఈ నేపధ్యంలోనే ఈరోజు (నవంబరు 26) న పాత ఆందోళన ప్రధమ వార్షి కొత్సవం జరుపుకుంటున్నారు.
 
ఈ సందర్భంగా ఢిల్లీ సరిహద్దులు రైతుల ఈరోజు భారీ సభ నిర్వహించారు. రైతు సంఘాల ఉమంది వేదిఅక పిలుపు మేరకు నిర్వహించిన ఢిల్లీ చలో కార్యక్రమంలో వేలాదిసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.వ్యవసాయ పంటలకు కనీస మద్ధతు ధర ఇచ్చేలా చట్టపరమైన హామీతో సహా తమ డిమాండ్లు నెరవేరే వరకు  రైతుల ఆందోళన కొనసాగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ టికాయత్ చెప్పారు.

వెన్నుచూపని రైతుల పోరాటానికి యావత్తు ప్రపంచం సెల్యూట్ చేసింది. ఏడాదిపాటు శాంతియుతంగా చేసిన పోరాటంలో 700 మందికిపైగా రైతులు ప్రాణాలు కోల్పోయారు. సాగు చట్టాలను కేంద్రం రద్దును స్వాగతించిన అన్నదాతలు.. మిగతా డిమాండ్లు నెరవేర్చే వరకూ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. తమ ఉద్యమానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టారు. పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోకి భారీగా రైతులు చేరుకున్నారు.
ఢిల్లీలో ధర్నాకు సంఘీభావం తెలుపుతూ కర్ణాటక, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రైతులు, ట్రేడ్ యూనియన్లు జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ప్రదర్శనలు నిర్వహించారు. మరో వంక  రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు సైతం మద్దతు ప్రకటించాయి. అయితే, రైతుల కొత్త డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందా లేక ఆందోళన ఈళాఆఏ కొనసాగనిస్తుందా చూడవలసి వుంది.