ప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ దర్శకావతారం

 

 

famous cartoonist Mallik director, Tokkalo prema movie, mallik thokkalo prema, cartoonist mallik director, Thokkalo Prema movie

 

 

కామెడీ ప్రపంచానికే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ 'తొక్కలో ప్రేమ' అనే సినిమా తో దర్శకా వతారంలో మన ముందుకు రాబోతున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని కొత్త ప్రొడక్షన్ హౌస్ మన ముందుకు తీసుక రాబోతుంది. ప్రస్తుతం తెలుగువన్.కాం క్రియేటీవ్ హెడ్ గా ఆయన చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు యెందరో ప్రముఖుల ప్రశంసలు పొందాయి.

 

తెలుగు కార్టూన్ ప్రపంచంలో మల్లిక్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు! ఇంకా చెప్పాలంటే మల్లిక్ ని మించినవారు లేరని చెప్పవచ్చు. మల్లిక్ గారు సృష్టించిన చిట్టి, టింగు తెలియనివారంటూ ఉండరు. ఒకానొక సమయంలో ప్రముఖ దిన,వార మాస పత్రికలు కేవలం మల్లిక్ కార్టూన్లు చదవడానికే కొనేవారన్నది అక్షరసత్యం. ఐదు వందలకు పైగా కధలు వివిధ పత్రికలకు వ్రాసారు. అలాగే యెన్నో ధారావాహికాలు కూడా ప్రచురింపబడ్డాయి. "పరుగో పరుగు”, "జీవితమే ఒక ఢమాల్" కధలు సినిమాలుగా తీయబడి జనాదరణను పొందాయి. అలాగే "మని", సిసింద్రీ" చిత్రాలకు పబ్లిసిటీ డిసైనర్ గా ఛాయాచిత్రాలను అందించారు. ఆల్ ఇండియా రేడియో వారికి ముఫైకి పైగా నాటికలు వ్రాసారు. అందులో "ఇంపోర్టెడ్ కెమేరా" రేడియో శ్రోతకు బాగా తెలిసిందే! ఇంకా యెన్నో టీ.వి ధారావాహికాలకు కధను అందించారు.