కవితకు జ్యుడిషియల్ రిమాండ్ పొడగింపు...చదువుకోవడానికి పుస్తకాలు కావాలని కోర్టుకు వినతి
posted on Jun 7, 2024 4:31PM
ఢిల్లీ మద్యం స్కాంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. కవిత బెయిల్ కోసం దరఖాస్తు చేసి ఇన్ని రోజులైనప్పటికీ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడవం లేదు. దీంతో బెయిల్ రాదని డిసైడ్ అయిపోయిన కవిత కాలక్షేపానికి పుస్తకాలు కావాలని కోర్టుకు మొదపెట్టుకుంది. కవిత వినతికి కోర్టు కూడా సానుకూలంగీసుకుంది.
కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో రిమాండ్‌ను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి తనకు పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరింది. కవిత విజ్ఞప్తికి కోర్టు ఆమోదం తెలిపింది. కవితకు జైల్లో ఎనిమిది పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు, మద్యం పాలసీ కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.