స‌బ్బం హ‌రికి సీరియ‌స్‌.. క‌రోనా కాటు.. గెట్ వెల్ సూన్‌..

మాజీ ఎంపీ స‌బ్బం హ‌రికి ఇటీవ‌ల క‌రోనా సోకింది. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలుస్తోంది. విశాఖ‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో వారం రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. వైద్యులు ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా.. ఆయ‌న ఆరోగ్యం కుదుట ప‌డ‌టం లేదు. ఇంట‌ర్న‌ల్ ఆర్గాన్స్‌కి ఇన్ఫెక్ష‌న్ సోక‌డంతో ఆయ‌న హెల్త్ కండిష‌న్ సీరియ‌స్‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. 

ఈ నెల 15న స‌బ్బం హ‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. అయినా, ఆయ‌న కోలుకోక‌పోవ‌డంతో వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. వారం రోజులుగా స‌బ్బం హ‌రికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే, వైద్యుల ప్ర‌య‌త్నాలు అంత‌గా ఫ‌లించ‌డం లేద‌ని అంటున్నారు. స‌బ్బం హ‌రి ఆరోగ్య ప‌రిస్థితిపై తెలుగుదేశం శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నారు. 

1995లో విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌పాల‌క సంస్థ మేయ‌ర్‌గా చేశారు. ఆ త‌ర్వాత కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. అన‌కాప‌ల్లి నుంచి పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌య్యారు. పార్ల‌మెంట్‌లో ఏపీ వాయిస్ గ‌ట్టిగా వినిపించేవారు. స‌బ్బం హ‌రికి మంచి వ‌క్త‌గా పేరుంది. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. జ‌గ‌న్‌రెడ్డి తీరుపై, వైసీపీ ప్ర‌భుత్వ విధానాల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేయ‌డంలో దిట్ట‌. సూటైన‌, ఘాటైన వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్ స‌ర్కారును ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జాకోర్టులో దోషిగా నిల‌బెట్టేవారు. అందుకే, ఆయ‌న‌పై క‌క్ష క‌ట్టింది ఏపీ ప్ర‌భుత్వం. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో.. రోడ్డుకు సెట్ బ్యాక్ వ‌ద‌ల లేదంటూ ఆయ‌న ఇంటి ప్ర‌హారీ గోడ కూల‌గొట్టి.. ప్ర‌తీకారం తీర్చుకుంది. అయినా, ప్ర‌భుత్వ బెదిరింపుల‌కు ఆయ‌న అద‌ర‌లేదు, బెద‌ర‌లేదు. జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌పై విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తూనే ఉన్నారు. తాజాగా, స‌బ్బం హ‌రి క‌రోనా బారిన ప‌డ‌టం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టం ఆందోళ‌న‌క‌రం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News