టిడిపిలో ఎర్రబెల్లి వర్సెస్ సీఎం రమేష్

 

 Errabelli Dayakar CM Ramesh, Errabelli Dayakar, telangana, seemandhra, tdp, chandrababu, samaikyandhra

 

 

తెలుగుదేశం పార్టీలో చిచ్చురేగుతున్నట్లుగా కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితం పయ్యావుల కేశవ్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు తాజా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తాము ఉండాలో లేదా రమేష్ ఉండాలో తేల్చుకుంటామని ఆయన అన్నారు.

 

సీఎం రమేష్ లాంటి దళారులు, వ్యాపార వేత్తల మూలంగానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని, కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేని రమేష్ ను పార్టీ ఎంపీగా పంపడం నష్టం చేస్తోందని ఎర్రబెల్లి అన్నారు. సీఎం రమేష్ ఓ బ్రోకర్, మోసగాడు అని, ఆయనను మీద వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. చంద్రబాబు విభజన లేఖకు కట్టుబడి ఉన్నారని అంటూనే దయాకరరావు ఈ డిమాండ్ చేయడం విశేషం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu