నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత

 

ప్రముఖ నిర్మాత, పూర్ణోదయ పతాకం మీద ‘శంకరాభరణం’ లాంటి అనేక ఉత్తమ సినిమాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఏడిద నాగేశ్వరరావు 1934 ఏప్రిల్ 24న జన్మించారు. నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారారు. ఆయన పూర్ణోదయ ఆర్ట్స్‌ పతాకంపై శంకరాభరణం, స్వయంకృషి, ఆపద్భాంధవుడు, సిరిసిరిమువ్వ లాంటి అత్యుత్తమ చిత్రాలను నిర్మించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu