భారత్ డిక్లేర్ .. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం
posted on Jul 5, 2025 9:58PM

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ 427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ (161) చెలరేగిపోయాడు. పంత్ (65), జడేజా (69*), కేఎల్ రాహుల్ (55) అర్ధశతకాలు బాదేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్, బషీర్ చెరో 2, రూట్, బ్రైడన్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు, తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 587 పరుగుల భారీ స్కోరు చేయగా, ఇంగ్లండ్ 407 రన్స్ ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 180 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ప్రస్తుతం మ్యాచ్‌లో ఇంకా ఐదు సెషన్ల ఆట మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో, భారత బౌలర్లు రాణిస్తే ఈ టెస్టులో భారత్ గెలిచే ఛాన్స్ ఉంది.