డ్రగ్స్‌ పార్టీ..డిప్యూటీ తహసీల్దార్‌ అరెస్ట్

 

 

డ్రగ్స్‌ కేసులో రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్‌ మణిదీప్‌ను హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు  అరెస్ట్‌ చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన పుట్టిన రోజులు వేడుకల్లో యువకులు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఈగల్‌ టీమ్‌ పోలీసులు గుర్తించారు. కీలక నిందితుడు విక్రమ్‌రెడ్డి సహా ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు ఇద్దరు యువతులు కూడా ఉన్నారు.

బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మల్నాడు రెస్టరంట్‌ డ్రగ్స్‌ కేసులో విక్రమ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించాడు. వారి నుంచి 20 గ్రాములు కోకైన్, నాలుగు గ్రాములు ఎండీఎంఎ, 20 ఎక్స్‌టీసీ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో డిప్యూటీ తహసీల్దార్‌ ఉండటం చర్చనీయాంశమైంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu