గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితురాలు అరెస్ట్
posted on Dec 30, 2025 3:23PM

గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంజారాహిల్స్‌కు చెందిన హస్సా అనే మహిళను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి MDMA మరియు LSD బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్ నెం.3, గెలాక్సీ మొబైల్ షాప్ సమీపంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో. ఆమెను విచారించగా, మాదకద్రవ్యాల వినియో గానికి సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హస్సాను అరెస్టు చేసిన అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెత్ మరియు ఆంఫెటమైన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
దీంతో ఆమె కేవలం వినియోగదారురాలే కాకుండా, డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో హస్సా చెప్పిన విషయాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. హస్సా డిసెంబర్ 2024లో బస్సులో గోవాకు వెళ్ళానని, అక్కడ హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన మీనా మరియు ఆమె స్నేహితుడు కిరణ్‌ను కలిసినట్లు వెల్లడించింది. గోవాలోని మెర్మైడ్ హోటల్‌లో కలిసి బస చేసి, వాగేటర్ బీచ్, వాగేటర్ క్లబ్‌లకు వెళ్లినట్లు తెలిపింది. అక్కడే, మీనా ద్వారా సియోలిమ్ (గోవా)కు చెందిన రోమి భరత్ కళ్యాణి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపింది.
ఆ సమయంలో రోమి ఇచ్చిన పసుపు రంగు పొడిని డ్రగ్‌గా వినియోగించినట్లు అంగీకరించింది. డిసెంబర్ 2025లో జరిగిన పర్యటనల్లో కూడా రోమి లేదా అతని మధ్యవర్తుల ద్వారా డ్రగ్స్ లావాదేవీలు జరిగినట్లుగా హస్సా పోలీసులకు వివరించింది.డిసెంబర్ 26, 2025న, సియోలిమ్ మరియు అనంతరం మాపుసాలో రోమి వ్యక్తిగతంగా కలసి MDMA మరియు LSD బ్లాట్స్‌ను అందించినట్లు హస్సా తెలిపింది. కొన్నిసార్లు హైదరాబాద్‌కు చెందిన సుమిహా ఖాన్, వజీర్ బాక్సర్ వంటి పరిచయస్తులతో కలిసి డ్రగ్స్ వినియోగించినట్లు కూడా హస్సా అంగీకరించింది.