TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ హత్యకు కుట్ర: పాక్ జాతీయుడికి 300 నెలల జైలు.!

Published on: Wed Nov 18, 2026 1:40PM

డొనాల్డ్ ట్రంప్ హత్యకు వ్యూహం పన్నిన పాకిస్థాన్ జాతీయుడైన ఆసిఫ్ మెర్చంట్‌కు అమెరికా కోర్టు ఏకంగా 27 సంవత్సరాల ఆరు నెలల (అంటే  330 నెలలు)  జైలు శిక్షను ఖరారు చేసింది. విదేశీ శక్తుల అండతో అమెరికా గడ్డపై జరిగిన ఈ కుట్ర యత్నం అప్పట్లో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.

అమెరికా న్యాయశాఖ,  దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం, 48 ఏళ్ల ఆసిఫ్ మెర్చంట్ కు ఇరాన్ నిఘా వర్గాలు,  రివల్యూషనరీ గార్డ్స్  తో సంబంధాలున్నాయి. గతంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ కమాండర్ ఖాసమ్ సోలేమానీ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇరాన్ ఈ కుట్రకు తెరలేపింది. ఈ నేపథ్యంలోనే ఆసిఫ్ మెర్చంట్ అమెరికాలో అడుగుపెట్టి ప్రముఖ రాజకీయ నాయకులను హతమార్చేందుకు కిరాయి హంతకుల కోసం అన్వేషణ ప్రారంభించాడు.

అయితే మెర్చంట్ సంప్రదించిన వ్యక్తులు మారువేషంలో ఉన్న ఎఫ్‌బీఐ  అండర్‌కవర్ ఏజెంట్లు కావడంతో ఈ కుట్ర భగ్నమైంది. హంతకులకు ముందస్తు చెల్లింపుగా ఐదు వేల డాలర్లు అందజేసినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టులో నిరూపించారు. అనుమానాస్పద కదలికలతో దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో టెక్సాస్‌లోని రిచ్‌మండ్‌లో ఫెడరల్ ఏజెంట్లు మెర్చంట్‌ను  అరెస్టు చేశారు.

ఈ విచారణ సందర్భంగా నిందితుడు తన కుటుంబ భద్రత కోసమే ఇరాన్ ఒత్తిడి మేరకు ఈ ప్లాన్‌లో భాగస్వామ్యమయ్యానని, తానెవరినీ చంపాలని భావించలేదని చెప్పుకున్నప్పటికీ,  కానీ అతని ఫోన్,  ల్యాప్‌టాప్‌లో లభించిన డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు అతడి తీవ్రవాద ఉద్దేశాలను స్పష్టంగా వెల్లడించాయి.  

ఇది కూడా చదవండి:  ట్రంప్ హత్యకు కుట్ర భగ్నం: నిందితుడి అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం.!​

అమెరికా ప్రజాస్వామ్యంపై, అత్యున్నత నాయకులపై జరిగే ఇటువంటి ప్రమాదకర దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్  స్పష్టం చేసింది.  ఈ తీర్పుతో అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు అమెరికా బలమైన సంకేతం పంపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

విదేశీ గడ్డపై ఉగ్ర కుట్రలకు పాల్పడేవారికి ఈ కఠిన శిక్ష ఒక గుణపాఠంలా నిలుస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇటువంటి ముప్పులను ముందే పసిగట్టి తిప్పికొట్టేందుకు నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

మీకు నచ్చవచ్చు:   ట్రంప్‌ హత్యకు ఇరాన్ కుట్ర?!

అగ్రరాజ్యాధినేత ట్రంప్ పై హత్యాయత్నం.. నిందితుడి కాల్చివేత

[DonaldTrump AssassinationPlot, AsifMerchantSentenced, Pakistan,  US DepartmentofJustice, TeluguOne]