ట్రంప్‌ హత్యకు ఇరాన్ కుట్ర?!

posted on: Jul 9, 2026 2:49PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్రపన్నిందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.  ఇటీవల కాలంలో ట్రంప్   ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ఇందుకు కారణం ట్రంప్‌ను భౌతికంగా అంతమొందించేందుకు ఇరాన్  భారీగా నిధులు కేటాయించిందన్న నిఘా వర్గాల సమాచారమే. ట్రంప్ హత్యకు ఇరాన్ పకడ్బందీ స్కెచ్ వేసిందన్న  గూఢచారి వర్గాల హెచ్చరికలతో అమెరికా రక్షణ వర్గాలు  ఉలిక్కిపడ్డాయి. 

గతంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది.   ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా   ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్  ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి. ఈ నిఘా సమచారం నేపథ్యంలో ట్రంప్ అధికారిక విమానమైన  ఎయిర్ ఫోర్స్ వన్ భద్రతను కనీవినీ ఎరుగని అత్యున్నత స్థాయికి పెంచారు. శతృదేశాల నుంచి వచ్చే ఎలాంటి క్షిపణి దాడులనైనా తిప్పికొట్టేలా ఈ అడ్వాన్స్‌డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అత్యాధునిక రక్షణ వ్యవస్థలను అమర్చారు. 

కేవలం విమానంలోనే కాకుండా, ట్రంప్ పర్యటించే ప్రతి ప్రాంతంలోనూ రక్షణ వలయాన్ని 300 శాతానికి పైగా పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ కాన్వాయ్‌లో తిరిగే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఆకాశంలో నిరంతరం నిఘా ఉంచే డ్రోన్లు, ప్రైవేట్ స్నైపర్ల మోహరింపును గతంతో పోలిస్తే రెట్టింపు చేశారు.  ట్రంప్ బహిరంగ సభలలో ప్రసంగించే వేదికల చుట్టూ ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ షీల్డ్‌లను రక్షణగా ఏర్పాటు చేస్తున్నారు. శత్రువులకు ఏ ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదపి  యూఎస్ సీక్రెట్ సర్వీస్ విభాగం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. 

ఇరాన్ పన్నుతున్న ఈ కుట్రలపై అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు 100 కు పైగా పేజీలతో కూడిన రహస్య డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు.  ఇరాన్ నిధులు పొందుతున్న కొన్ని విదేశీ ముఠాలు అమెరికా గడ్డపైనే ట్రంప్ కదలికలను నిశితంగా గమనిస్తున్నాయని   నివేదిక పేర్కొంది. అయితే ఈ ముప్పు సంకేతాలపై ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ఇరాన్ గనుక అలాంటి సాహసానికి ఒడిగడితే ఆ దేశాన్ని మ్యాప్ నుంచి తుడిచేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా  హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా అధ్యక్షుడు ఇలాంటి గ్లోబల్ థ్రెట్‌ను ఎదుర్కోవడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ కుట్రలను తిప్పికొట్టేందుకు అమెరికా సైన్యం దాదాపు 24 గంటలూ హై అలర్ట్‌లో ఉంటూ సరిహద్దులను, గగనతలాన్ని డేగకన్నుతో పర్యవేక్షిస్తోంది.

Iran Assassination Threat, Air Force One Security, US Intelligence Report, Secret Service High Alert, Iran US Conflict

google-ad-img
    Related Sigment News
    • Loading...