TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ట్రంప్ హత్యకు కుట్ర భగ్నం: నిందితుడి అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం.!

Published on: Sat Nov 7, 2026 7:39AM

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్రను భద్రతా సిబ్బంది భగ్నం చేశారు.  దేశ అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పరిసర ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రతా వలయాన్ని ఛేదించి డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చాలనే  లక్ష్యంతో భారీ ఆయుధాలతో సంచరిస్తున్న ఒక   వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  వాషింగ్టన్ డీసీలోని   కాన్‌స్టిట్యూషన్ అవెన్యూ ప్రాంతంలో అనుమానాస్పద రీతిలో పార్క్ చేసి ఉన్న ఒక వాహనాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ వాహనం వద్ద సంచరిస్తున్న వ్యక్తి కదలికలపై అనుమానం రావడంతో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. 

విచారణలో భాగంగా అతడిని వెనిజులా చెందిన అక్రమ వలసదారుడు రోనీ యోడ్రిక్స్ గువానిపా క్రినోస్‌గా గుర్తించారు. ప్రాథమిక విచారణలో నిందితుడు  తన తలలో వినిపిస్తున్న కొన్ని విచిత్రమైన స్వరాలే ట్రంప్‌ను అంతం చేయాలని తనకు ఆదేశాలు జారీ చేశాయని, ఆ ఉద్దేశంతోనే తాను ఇక్కడికి చేరుకున్నానని  సమాధానం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

అనంతరం అధికారులు ఆ వ్యక్తి   వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అది పూర్తిగా చోరీ చేసిన  ట్రక్కుగా తేలింది. ఆ వాహనం లోపల అత్యంత శక్తిమంతమైన ఏఆర్-15 తరహా రైఫిల్, మ్యాక్-10 సబ్ మెషిన్ గన్, గ్లాక్ 43ఎక్స్ హ్యాండ్‌గన్ వంటి   తుపాకులతో పాటు వందల సంఖ్యలో తూటాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి చట్టపరమైన పత్రాలు, అనుమతులు లేకుండానే ఈ మారణాయుధాలను సేకరించి, అత్యంత సున్నితమైన ప్రాంతానికి అతడు ఎలా చేరుకోగలిగాడనే కోణంలో భద్రతా నిపుణులు ఆరా తీస్తున్నారు.

 నిందితుడు క్రినోస్ గతంలో టెక్సాస్ సరిహద్దు మార్గం గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ( వెల్లడించింది. అప్పటి నుంచి అమెరికాలోనే ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా అజ్ఞాతంలో తలదాచుకుంటూ వస్తున్నాడు. ఈ ఘటనపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పందిస్తూ, సమయానికి సీక్రెట్ సర్వీస్ అధికారులు అప్రమత్తం కావడం వల్ల   పెద్ద ప్రాణనష్టం జరగకుండా ముందే నివారించగలిగామని పేర్కొంది. ఎలాంటి హాని తలపెట్టే లోపే అతడిని కట్టడి చేయడం భద్రతా దళాల అప్రమత్తతకు నిదర్శనమని ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: అగ్రరాజ్యాధినేత ట్రంప్ పై హత్యాయత్నం.. నిందితుడి కాల్చివేత

ఈ  ఘటనకు సంబంధించి నిందితుడిపై ఆయుధాల చట్టాల ఉల్లంఘన, వాహన చోరీ, రిజిస్ట్రేషన్ లేని మారణాయుధాలు కలిగి ఉండటం,   హత్యకు కుట్ర వంటి   అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించి, త జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. చోరీ చేసిన ఆ ట్రక్కులోనే తాను జీవిస్తున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు న్యాయస్థానపు రికార్డుల ద్వారా స్పష్టమైంది.

అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ఫెడరల్ ప్రాసిక్యూటర్లు సైతం ఈ దర్యాప్తును నిశితంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఫెడరల్ కోర్టుకు బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్,  ఇతర అత్యున్నత స్థాయి ప్రముఖుల భద్రతకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, సరిహద్దుల భద్రత మరియు అక్రమ వలసదారుల కదలికలపై నిఘా వైఫల్యాల గురించి మరోసారి చర్చ జరుగుతోంది. 

మీకు నచ్చవచ్చు:  ట్రంప్ ను ఖతం చేస్తే.. 96 కోట్లు.. ఇరాక్ సాయుధ గ్రూప్ ఫత్వా.!

ఇరాన్‌ను సర్వనాశనం చేస్తా: యూఎన్ఓ వేదికగా ట్రంప్ హెచ్చరిక..!

[Donald Trump Assassination Plot, White House security Breach, Rony Yodrix Guanipa Crinos, US Secret Service arrest, Weapons Seized, TeluguOne]