పాక్ కు చురకలు అంటించిన ట్రంప్...
posted on May 22, 2017 12:50PM
.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రియాద్‌లోని అరబ్ ఇస్లామిక్-యూఎస్ సదస్సులో పాల్గొన్న ట్రంప్ భారత్ గురించి ప్రస్తావిస్తూ పాక్ కు చురకలు అంటించారు. ఈ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ కూడా ఉగ్రవాద బాధిత దేశమని ఆయన గుర్తుచేశారు. దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాద భావజాలాన్ని అణిచేందుకు ఆయా దేశాలతో కలిసి పనిచేస్తామని, అమెరికా నుంచి భారత్ వరకు, ఆస్ట్రేలియా నుంచి రష్యా వరకు అన్ని దేశాలు ఉగ్రవాద బాధితులేనని.. ఏ దేశం కూడా తమ భూభాగంలో ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించకూడదని అన్నారు. అయితే ఈ సందర్బంగా ఆయన పాకిస్థాన్ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించనప్పటికీ పరోక్ష హెచ్చరికలు చేశారని అంటున్నారు.