మే 18 నుంచి ఎగరనున్న దేశీయ విమానాలు!

ఈ నెల 17‌తో లాక్‌డౌన్‌ గడువు ముగియనున్న నేపథ్యంలో ఆ తర్వాతి రోజు నుంచి దేశీయ విమాన సర్వీసులు నడపాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం విమాన సేవలు పునఃప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం.

విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలపై డీజీసీఏ, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులు, డీఐఏఎల్ అధికారులతో కూడిన కమిటీ ఢిల్లీ విమానాశ్రయంలో నిన్న తనిఖీలు నిర్వహించింది. సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి దేశీయ సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికార వర్గాలు తెలిపాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu