జైపాల్ రెడ్డికి షాక్ ఇస్తున్న డీకే అరుణ.!!

 

తెలంగాణ కాంగ్రెస్ లీడర్ డీకే అరుణకు మొదటి నుండి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది.. పార్టీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా, ఎంతమంది కొత్తవారు పార్టీలో చేరినా ఆమె తన మార్క్ చూపిస్తూనే ఉంటారు.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేల డీకే అరుణ తన మార్క్ చూపిస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేతలు  జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే 76 ఏళ్ల వయసొచ్చిన జైపాల్ రెడ్డికి ఇంకా రాజకీయాలెందుకు? అని ఆమె ప్రశ్నిస్తున్నారట.. ఈసారి మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాన్ని ఆయనకిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నట్టు సమాచారం.. అంతేకాదు మహబూబ్‌నగర్ ఎంపీ సీటు తన కూతురు స్నిగ్ధారెడ్డికి దక్కేలా లాబీయింగ్ చేసే పనిలో పనిలో పడిపోయారట డీకే అరుణ.. మరోవైపు ఉత్తమ్ పదవికి కూడా అరుణ టెండర్ పెట్టినట్టు తెలుస్తోంది.. రీసెంట్ మాట్లాడుతూ తాను ఎప్పట్నుంచో పీసీసీ ప్రెసిడెంట్ రేసులో వున్నానని చెప్పిన అరుణ.. ఎన్నికల్లోగా ఆ కోరిక తీరినా ఆశ్చర్యం లేదంటున్నారు.. చూస్తుంటే డీకే అరుణ సీనియర్లకు బాగానే షాక్ ఇచ్చేలా ఉన్నారుగా.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News