ఢిల్లీకి దినకరన్... అరెస్ట్ చేసే అవకాశం...!

 

టీటీవీ దినకరన్ ఇంటికి పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తనకు కొంత సమయం కావాలని దినకరన్ పోలీసులను కోరగా.. అందుకు పోలీసులు నిరాకరించారు. ఈనేపథ్యంలోనే ఆయన ఈరోజు ఉదయం చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా పార్టీ గుర్తు కోసం ఈసీ అధికారులకు లంచం ఇచ్చేందుకు దినకరన్ ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగానే పోలీసులు దినకరన్ కు నోటీసులు జారీ చేశారు.