ధ్వజస్తంభం కింద...

 

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం తొలగిస్తుండగా ధ్వజస్తంభం కింద పురాతన వెండి, రాగి, బంగారు నాణేలు లభ్యమయ్యాయి. సింహాచలం దేవస్థానంలో 161 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన ధ్వజస్తంభాన్ని తొలగించి ఫిబ్రవరి 9వ తేదీన నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠాపన చేయడానికి ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాత ధ్వజస్తంభాన్ని తొలగించడానికి మూడు రోజుల నుంచి తవ్వకాలు జరుపుతున్నారు. బుధవారం నాడు ధ్వజస్తంభం వెలికి తీసిన తర్వాత ధ్వజస్తంభం కింద అనేక పురాతన వెండి, బంగారు, రాగి నాణేలు లభించాయి. వీటిని ఆలయ భాండాగారానికి తరలించారు.