సినీ నటుడి స్థలం కబ్జా

 

ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాలకు చెందిన భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారు. దేవదాస్ కనకాల ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలకు తండ్రి, నటి, యాంకర్ సుమకు మామగారన్న విషయం తెలిసిందే. దేవదాస్ కనకాలకు హైదరాబాద్‌లోని హయత్ నగర్ ప్రాంతంలో కొంత భూమి వుంది. మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు ఆయనకు చెందిన స్థలాన్ని కబ్జా చేశారు. దాంతో దేవదాస్ కనకాల ఆయన కుమారుడు రాజీవ్ కనకాల హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కబ్జాదారుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.