ధరణి జోలికొస్తే అంతే ..

తాము అధికారంలో వస్తే ధరణి పోర్టల్ ఎత్తివేస్తామని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటనపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ధరణి జోలికొస్తే బంగాళా ఖాతంలో విసిరేస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. 2020 అక్టోబర్ 29న ప్రారంభమైన ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి వివాదాస్పదమైంది. భూమి రిజిస్ట్రేషన్ సర్వీసు మొదలు భూసంబంధిత సేవలు 
ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంటాయి. చెకింగ్ ల్యాండ్ రికార్డ్స్, లాండ్ మార్కెట్ వాల్యూ, ఈసీ వివరాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలు ధరణిలో అందుబాటులో ఉంటాయి. మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ఆవిష్కరణ ధరణి పోర్టల్ అని ప్రచారంలో ఉంది. 
భూములు లేనివారికి సైతం భూమి ఉన్నట్లు ధరణి పోర్టల్ లో నమోదయ్యాయి. కాబట్టి కెసీఆర్ కుటుంబం ఈ భూములు కాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అసలు లబ్దిదారులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి ఎటువంటి సెల్ లేదు. లక్షలాది ఫిర్యాదులు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. హైకోర్టు ను ఆశ్రయిస్తే తప్ప ఫిర్యాదులు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఫిర్యాదు దారుల ఆర్థిక స్థోమత బలహీనంగా ఉంటే జీవిత కాలంలో కూడా న్యాయం జరిగే అవకాశాలు తక్కువ. 
విజయలక్ష్మి అనే మహిళ ఒక ఎకరం 32 గుంటల భూమిని 2019 ఆగస్ట్ లో కోట్ల జగదీశ్ కు విక్రయించింది. కానీ అదే భూమి విజయ లక్ష్మికి విక్రయించినట్లు ధరణిలో నవంబర్ 4న రికార్డ్ అయ్యింది.ఖంగుతిన్న జగదీశ్ తహసీల్ దార్ ను సంప్రదించాడు. అయితే ఈ భూమి ఇంకా విజయలక్ష్మి పేరు మీదే ఉంది. ఇంత వివాదాస్పద ధరణి పోర్టల్ లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడుకరవయ్యారు.