ధనుష్ మరో సినిమా వస్తోంది

 

రజనీకాంత్ అల్లుడు ధనుష్ తమిళనాడులో పెద్ద హీరో. హిందీలోకి ఎంటరై రెండు హిట్లు కొట్టాడు. అయితే మొన్నటి వరకు ధనుష్ సినిమాలకు తెలుగులో ఎంతమాత్రం డిమాండ్ లేదు. ఈమధ్య విడుదలైన ‘రఘువరన్ బీటెక్’ సినిమాతో ధనుష్‌కి తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించింది. ఈ నేపథ్యంలో ధనుష్ తాజా సినిమా ‘అనేకన్’ తెలుగులో ‘అనేకుడు’ పేరుతో విడుదలవుతోంది. ‘రంగం’, ‘బ్రదర్స్’ చిత్రాల దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ధనుష్ సరసన అమైరా దస్తూర్ హీరోయిన్‌గా నటించింది. హ్యారీస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా ఆడియో మంగళవారం నాడు హైదరాబాద్‌లో విడుదలైంది. హైదరాబాద్‌లోని ఒక మాల్‌లో జరిగిన ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో ధనుష్, అమైరా దస్తూర్, వి.వి.వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu