తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం (ఫిబ్రవరి 7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లే లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక గురువారం శ్రీవారిని మొత్తం 58 వేల 908 మంది దర్శించుకున్నారు. వారిలో 10 వేల 549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 23 లక్షల రూపాయలు వచ్చింది.