రాజీవ్ యువ వికాసం..నిరుద్యోగులకు గేమ్ ఛేంజర్ : భట్టి

రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ఈ పథకం ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుందని తెలిపారు. జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో యువ వికాసం పథకం అమలుపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  బ్యాంకుర్లు ముందుకు వస్తే యువత ఆర్దికంగా ఎదుగుతారని రూ.61 వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. . రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు  గడువును మరోసారి పెంచుతూ కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. దరఖాస్తు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం  అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది

 

.సాంకేతిక సమస్యల కారణంగా పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయిన నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు రావడంతో రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఎన్‌ఎస్‌యూఐ నేతలు సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గడువు పెంపుపై వినతిపత్రం సమర్పించారు. పెద్ద ఎత్తున వస్తున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఏప్రిల్ 24వ తేదీ వరకు పొడిగించింది. ప్రభుత్వం మండల, మున్సిపల్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. వీరి ఆధ్వర్యంలోనే అర్హుల ఎంపిక జరుగుతుంది. అర్హుల జాబితా రూపొందించిన తర్వాత కమిటీ నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తారు. అన్నింటిని పరిశీలించిన తర్వాత కలెక్టర్‌ తుది జాబితాను రీలీజ్ చేస్తారు. పథకానికి ఎంపికైన వారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న రుణ పత్రాలు అందజేయనున్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News