మోహన్ బాబు మీద మరో కేసు
posted on Nov 28, 2012 12:53PM

దేనికైనా రెడీ సినిమా వివాదం మోహన్ బాబుని వెంటపడి తరుముతోంది. సినిమా విడుదలై నెలరోజులు దాటినా బాబుకి చిక్కుల తప్పడంలేదు. ఫిర్యాదులు, కేసుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమాలో హిందూ బ్రాహ్మణ సమాజాన్ని, వాళ్ల ఆచారవ్యవహారాల్ని కించపరిచేలా ఉన్న దృశ్యాల్ని తొలగించాలని లేదా సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తారా స్థాయికి చేరుతున్నాయి.
బ్రాహ్మణులపై అభ్యంతరకరమైన సీన్లతో ఉన్న దేనికైనా రెడీ సినిమాని వెంటనే నిషేధించాలని కోరుతూ వరంగల్ జిల్లా జనగామ వాసి పవన్ కుమార్ ఓ పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ ని స్వీకరించి పరీశీలించిన కోర్టు మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం, డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, రచయిత కోన వెంకట్, రీజినల్ సెన్సార్ అధికారి ధనలక్ష్మిలపై కేసు నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ 420, 295 ఎ, 298, 153 ఏఆర్/డబ్ల్యూ, 120 బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.