అఖిలపక్ష సమావేశం.. ప్రతిపక్షాలు సహకరించాలి.. వెంకయ్య


ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ములాయం, కేకే, తోట నర్సింహతో పాటు అన్నీ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలు, పెండింగ్ బిల్లులపై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు కరువు, వరద పరిస్థితులు, నిత్యవసర వస్తువులు ధరలపై సమగ్ర చర్చ జరిపారు. అంబేద్కర్ 125 జయంతి పురస్కరించుకొని రెండు రోజుల పాటు ఉభయ సభల సమావేశాలు జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలు 28 రోజులు జరుగుతాయని.. మొత్తం 38 బిల్లులు చర్చుకు రానున్నాయని.. 7 కొత్త బిల్లులు.. 24 ప్రాధాన్యత బిల్లులపై చర్చ జరగనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బిల్లులపై కొన్ని సవరణలు సూచించిందని.. బిల్లుల సవరణపై అరుణ్ జైట్లీ దృష్టి సారించారని..అన్ని బిల్లులు పాస్ అయేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు.