మెగాస్టార్ చిరు పై డైరెక్టర్ దాసరి సెటైర్లు
posted on Mar 14, 2013 5:17PM

తెలుగు సీరియల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో దాసరి నారాయణరావు కేంద్రమంత్రి చిరంజీవిపై పరోక్షంగా సెటైర్లు వదిలారు. మా టీవిలో డబ్బింగ్ సీరియల్స్ కాకుండా తెలుగు సీరియల్స్ మాత్రమే ప్రసారమయ్యేలా చిరంజీవి చొరవ తీసుకోవాలని సూచించారు. తెలుగు మహాసభల్లో చిరంజీవి తెలుగువాడినని నిరూపించుకున్నారు. తెలుగు బాషను మరచిపోతున్నామని ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి.
కేంద్రమంత్రి చిరంజీవి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆయన్ను కలిసే అవకాశం తెలుగు టీవీ కళాకారులకు దొరకడం లేదు. తెలుగు టీవీ కళాకారుల ఆందోళన విషయం ఆయనకు ఇంకా తెలియలేదనుకుంటా.. తెలిస్తే తన మా టీవిలో డబ్బింగ్ సీరియళ్లు రాకుండా నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని దాసరి అన్నారు.