హైకమాండ్ వెనక్కి తీసుకోదు

 

d srinivas telangana, telangana d srinivas, d srinivas congress

 

 

తెలుగువారు మన ఒక్క రాష్ట్రంలోనే లేరని, అనేక రాష్ట్రాలలో ఉన్నారని, అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని,కొందరు అత్యంత ప్రముఖ స్థానాలలో కూడా ఉన్నారని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. తెలుగుజాతి ఐక్యతను కాపాడుకోవాలని, రాష్ట్రాలుగా విడిపోయినా, ఒకే జాతిగా కలిసుందామని పేర్కొన్నారు.

 

విభజన ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణపై నిర్ణయాన్ని అధిష్టానం వెనక్కి తీసుకునే అవకాశమే లేదని డీఎస్ స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకంలో సమస్యలుండవని ఆయన అన్నారు. మంచి రాజదానికి ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం సిద్దంగా ఉందని కూడా డి.శ్రీనివాస్ తెలిపారు. కనుక సీమాంధ్ర అభివృద్దికి ఇది మంచి అవకాశం అని కూడా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.



12 సంవత్సరాలుగా సంప్రదింపులుగా ప్రక్రియ జరిపిన తరువాతే విభజనకు కేంద్ర నాయకత్వం పూనుకుందని చెప్పారు. ఉద్యోగుల మధ్య అపోహలు తొలగించడానికి గాను ఉభయులు కలసి చర్చించుకోవచ్చని అన్నారు. తనకు రెండువైపులా ప్రజలతో సత్సంబందాలు ఉన్నవ్యక్తిగా ఈ పరిస్థితిని చూసి ఆవేదన చెందుతున్నానని అన్నారు.